టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ భారీ అంచనాల నడుమ 'అఖండ' సినిమాతో బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే దుమ్ము రేపింది. కలెక్షన్స్ విషయంలో అఖండ ఏమాత్రం తగ్గలేదు. కేవలం ఎనిమిది రోజుల్లోనే అఖండ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా పూర్తి లాభాల బాటలో నడుస్తుంది. ఇక తాజాగా అఖండ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమా రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. 

తాజాగా హాట్ స్టార్ ఓటిటిలో అఖండ కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఓటీటీ లో వచ్చిన తెలుగు సినిమాల్లో కేవలం 24 గంటల్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన చిత్రం అఖండ కావడం విశేషం. ఇక అఖండ ఈ రికార్డు సాధించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టాలీవుడ్ అగ్రహీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. సాధించలేని రికార్డును బాలయ్య సాధించి చూపించాడు. ఇక ఇటీవలే అఖండ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేసింది.

ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఈసినిమా తో బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ పడింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా లో యువ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: