మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో నవదీప్ కూడా ఒకడు. ఒకప్పుడు వరుస ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ గా పేరొందిన నవదీప్..ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడంతో పాటు పలు సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తూ అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అల వైకుంఠ పురం లో సినిమాలో అల్లు అర్జున్ కి ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత మోసగాళ్లు చిత్రంలో హీరో విష్ణు స్నేహితుడిగా కూడా కనిపించాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్. 

దాదాపు 35 ఏళ్ల వయసు దాటిన కూడా పెళ్లికి మాత్రం ఇంకా టైం ఉందని అని అంటున్నాడు నవదీప్. అయితే నవదీప్ ఫ్యాన్స్, నెటిజెన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నవదీప్ పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు. అయితే వాటికి నవదీప్ మాత్రం చాలా ఫన్నీగా ఆన్సర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ 'గడ్డం నెరిసిపోతుంది. ఇప్పటికైనా పెళ్లి చేసుకో' అని సోషల్ మీడియా వేదికగా నవదీప్ ని అడిగాడు. దానికి నవదీప్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'గడ్డం తెల్ల పెడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పెడితే గోక్కుంటాం. కానీ తోలు పీకేసుకోమ్ కదా' అంటూ ఆ నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నవదీప్. 

దీంతో సోషల్ మీడియా వేదికగా నవదీప్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారుతోంది. అయితే గతంలో కూడా నవదీప్ చాలామంది నెటిజన్స్ కి పెళ్లి విషయంలో ఇలా ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు. అయితే ఈ సారి మాత్రం దానికి భిన్నంగా కౌంటర్ ఇచ్చాడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం నవదీప్ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో నాగచైతన్య నటించబోయే ఓ వెబ్ సిరీస్ లో నవదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: