టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ఎట్టకేలకు 'అఖండ' సినిమాతో ఘన విజయం దక్కింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కి జోడిగా నటించి మెప్పించింది ప్రగ్య. అయితే అందం, అభినయం ఉన్నా  ఈ హీరోయిన్ కి పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు మాత్రం రావడం లేదు. అఖండ సినిమా విడుదలై సుమారు రెండు నెలలు కావస్తోంది. అయినా ప్రగ్యా జైస్వాల్  మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాకు సంతకం చేయలేదు. మరో సినిమాకి సైన్ చేసే ఆసక్తి ఉన్నా.. ఆమెకు మాత్రం ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి టాలీవుడ్లో ఓ హీరోయిన్ కి భారీ హిట్ పడితే.. వెంటనే ఆమెకు వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. 

కానీ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినా.. ప్రగ్యా జైస్వాల్ ఫేట్ మాత్రం మారడం లేదు. అయితే ఆమెకు ఛాన్సులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె తన రెమ్యూనరేషన్ రెట్టింపు చేసిందని.. ప్రస్తుతం ఈమె ఒక్క సినిమాకు కోటి రూపాయలకు పైనే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. అఖండ లాంటి భారీ విజయం వచ్చాక తాను 50 లక్షలు తీసుకుంటే.మ్ అది తన విజయానికి అవమానంగా ఉంటుందని.మ్ అందుకే ఆమె కోటి రూపాయలు పారితోషికం తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయిందట. కోటి ఇవ్వలేమని ఎవరైనా నిర్మాతలు అంటే? ఎందుకు ఇవ్వరు? అని అడుగుతుందట ఈ ముద్దుగుమ్మ.

అందుకే ఇప్పటికే ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆమెకు ఆఫర్లు వచ్చినా.. రెమ్యూనరేషన్ విషయంలో నచ్చక ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట. ఎట్టి పరిస్థితుల్లో తను కోటి రూపాయలకు తగ్గను అంటోందట. మరి ప్రగ్యా జైస్వాల్ డిమాండ్లకు ఓకే చెప్పే నిర్మాతలు ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికే ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ పదేళ్లలో ఆమె ఎన్నడూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు. అందుకే ఎలాగైనా ఇప్పుడు కోటి రూపాయలు అందుకోవాలని బాగా ముచ్చటపడిపోతుందట. మరి ప్రగ్యా ముచ్చట తీర్చే నిర్మాత ఎవరు అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: