టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు పలువురు అగ్రహీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా మన ఇండస్ట్రీలో వాయిదాపడిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తాజాగా నిర్మాత గిరి తాను నిర్మింక్చాలనుకున్న ఓ క్రేజీ మల్టీస్టారర్ గురించి తెలిపాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఆ తర్వాత తరంలో కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు కూడా కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత వచ్చిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్ లు అంతగా మల్టీస్టారర్ మూవీస్ చేయలేకపోయారు. 

అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సరైన కథ దొరకడంతో పాటు వాళ్లతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నిర్మాతలు అప్పట్లో ధైర్యం చేయలేకపోయారు. ఈ విషయం పక్కన పెడితే సీనియర్ ప్రొడ్యూసర్ ఆవుల గిరి గతంలో ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారని భావించారట. అందుకుగాను హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకొని డైరెక్టర్గా రాజమౌళిని పిక్స్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ విషయమై చిరంజీవిని కలిసి ఆయనకు కూడా చెప్పారట.చిరు  కూడా ఈ మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడట. కానీ కథ బాగుండాలని అలా బాగుంటే తప్పకుండా చేద్దాం అని అన్నాడట.

ఇక ఈ సినిమా కథగా రాజస్థాన్లోని మేవార్ రాజు మహావీర్ రాణా ప్రతాప్ సింగ్ స్టోరీ అయితే సరిపోతుందని అనుకున్నారట.కానీ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.అయితే ఆయన అనుకున్న ప్రకారం రాజమౌళి డైరెక్షన్లో చిరంజీవి, రామ్ చరణ్ సినిమా చేశారు. ఎన్టీఆర్..చిరు తో సినిమా చేయలేకపోయినా.. ఆయన తనయుడు రామ్ చరణ్ తో సినిమా చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో  త్రిబుల్ ఆర్ మూవీ టాలీవుడ్ లోనే క్రేజీ మల్టీస్టారర్  గా తెరకెక్కింది.ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: