అఖండ హిట్ తో జోష్ మీద ఉన్న బాలయ్య బాబు ఆహా ఓటీటీలో వచ్చే అన్ స్టాపబుల్ షోతో కూడా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ షోలో బాలకృష్ణ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. బాలయ్య అసలు మనసు ఏంటన్నది ఈ షో ద్వారా ప్రూవ్ అయ్యింది. అహాలో వచ్చే అన్ స్టాపబుల్ షో చాలా రికార్డులను తిరగ రాసింది. అయితే ఈ షోతో ఏర్పడ్డ బంధంతో అల్లు, నందమూరి కాంబోలో సినిమా వస్తుందని టాక్. అల్లు అరవింద్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందట.

మెగా బ్యానర్ గా గీతా ఆర్ట్స్ లో బాలయ్య బాబు హీరోగా సినిమా చేయాలని చూస్తున్నారట. ఎలాగు అన్ స్టాపబుల్ షోతో వారి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఏర్పడిందని తెలుస్తుంది. అందుకే గీతా ఆర్ట్స్ లో బాలయ్య సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ప్రపోజల్ కూడా ముందు గీతా ఆర్ట్స్ బాలకృష్ణ ముందు పెట్టబోతుందని తెలుస్తుంది. స్మాల్ స్క్రీన్ మీద ఆహా అన్ స్టాపబుల్ షో అదరగొట్టగా ఇప్పుడు ఈ హంగామాని వెండితెర మీద కొనసాగించేంద్దుకు అన్ స్టాపబుల్ కాంబో సెట్ అవుతుంద్ది.

ఓ స్టార్ డైరక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్. ఇప్పటికే బాయ్యకి చూచాయగా గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేఎయాలని అడగడం బాలకృష్ణ కూడా సుముఖంగానే ఉన్నానని చెప్పడం జరిగందట. అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో మరోసారి ఫ్యాక్షన్ కథతో చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని టాక్. ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం మెగా నందమూరి ఫ్యాన్స్ కి మరోసారి స్పెషల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ కాంబోకి డైరెక్టర్ ఎవరు.. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుంది లాంటి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: