అఖండ సినిమాతో బాలకృష్ణతో పాటుగా ప్రగ్యా జైశ్వాల్ కూడా కెరియర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. సినిమాకి అమ్మడి గ్లామర్ కూడా ప్లస్ అయ్యింది. అయితే హిట్టు కొట్టిన ప్రతి హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచడం కామనే. ఈ క్రమంలో ప్రగ్యా జైశ్వాల్ కూడా రెమ్యునరేషన్ ని పెంచేసిందట. కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తేనే సినిమా చేస్తా అంటుందట. నిన్నటివరకు పెద్దగా అవకాశాలు లేని ఈ అమ్మడు అఖండ హిట్ తో మళ్లీ మంచి అవకాశాలు తెచ్చుకుంటుందని టాక్.

డేగ, మిర్చిలాంటి కుర్రాడు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ వరుణ్ తేజ్ కంచె సినిమాతో కెరియర్ లో మొదటి హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. నాగారున ఓం నమో వెంకటేశాయ సినిమా కూడా చేసింది. మంచు మనోజ్ గుంటూరోడు.. నక్షత్రం.. జయ జానకి నాయకా సినిమాలు చేసింది. అఖండ హిట్ తో ప్రగ్యా జైశ్వాల్ మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బాలకృష్ణతో మరో సినిమా కూడా అమ్మడు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సీనియర్ హీరోల సరసన కూడా నటించేందుకు ప్రగ్యా జైశ్వాల్ సై అంటుంది. అయితే రెమ్యునరేషన్ మాత్రం కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుందట. అందం.. అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు కెరియర్ లో తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ప్రగ్యా జైశ్వాల్ తెలుగులో మరో రెండు సినిమాల అవకాశాలను అందుకుందని టాక్. తమిళ సినిమా విరాట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రగ్యా జైశ్వాల్ హిందీలో కూడా ఒక సినిమా చేసింది. మరి కోటి రెమ్యునరేషన్ అంటే ప్రగ్యా రేంజ్ కి ఎక్కువే అనిపించినా ఆమె మాత్రం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదిలేదని అంటుందట. మరి ప్రగ్యా అడిగినంత ఇచ్చి ఆమెని సినిమాల్లోకి తీసుకుంటారా లేదా అన్నది ఆమె చేసే సినిమాలని బట్టి ఉంటుంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: