ప్రముఖ నటి మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనల్స్ తో కలిసి సరోగసీ పద్ధతి లో ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించారు. సరోగేట్ ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వడం తమకు అమిత ఆనందాన్ని ఇచ్చిందని ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. దీంతో ఈ జంటకు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. వీరే కాదు నటుడు షారుక్ ఖాన్ దంపతులు,శిల్పాశెట్టి దంపతులు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చారు. వ్యాపార వేత్తలు, ప్రముఖులు సరోగసీ ఈ విధానంలో పిల్లలను పొందారు. వీరంతా సరోగసీ ద్వారా పిల్లలను ఎందుకు కంటున్నారు? సరోగసి అంటే ఏమిటి..?

 పిల్లలను కావాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకొని పిల్లలను కనే పద్ధతిని సరోగసి అంటారు. పురుషుడి వీర్యాన్ని సేకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఆ జంట కోసం పిల్లలను తమ కడుపులో పెంచి ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. కేవలం పురుషుడి వీర్యం తో బిడ్డను కనిపించిన ఆ మహిళ బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ ప్రసవం అనంతరం ఆ స్ట్రీకి, బిడ్డకు ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. బిడ్డపై సరోగ్రేట్ మదర్ కు ఎటువంటి హక్కులు ఉండవు. కేవలం ప్రసవానికి,అద్దె గర్భానికి ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లిస్తారు. సరోగసీ ద్వారా బిడ్డను కనడం వెనక దంపతుల యొక్క వ్యక్తిగత సమస్యలు సహా  అనేక కారణాలున్నాయి. పిల్లలకు కావాలనుకునే దంపతులలో సంతానోత్పత్తి సమస్యలున్నా, స్త్రీకి గర్భస్రావం లేదా గర్భం ప్రమాదకరంగా మారినప్పుడు మరియు గర్భం దాల్చలేని సమయంలో ఈ సరోగసి పద్ధతిని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీ ఫ్యాషన్ రంగాలకు చెందిన మహిళలు ఈ పద్ధతిని ఎంచుకుంటారు. కాన్పు తర్వాత మహిళలో వచ్చే శారీరక మార్పుల కారణంగా ఎక్కడ తాము వృత్తికి దూరమవుతామనే భ్రమలో కొందరు ఈ సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను పొందుతున్నారు. సరోగేట్ గా అద్దెకు గర్భన్ని ఇచ్చేందుకు పరిస్థితులను బట్టి పదిహేను లక్షల నుంచి 30 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదన ఉంది. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసి ని నిషేధించి నియమ నిబంధనలను కఠినతరం చేసింది. 2020లో సరోగసి నియంత్రణ బిల్లులు, కొన్ని సంస్కరణలు చేర్చిన ప్రభుత్వం గర్భన్ని అద్దెకు ఇచ్చేందుకు కొన్ని షరతులు విధించింది.

 సరోగేట్ గా మారే మహిళకు వివాహం అయి ఉండాలి. ఆమె సొంతంగా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సరోగేట్ మదర్ వయసు కనీసం 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండి, సరోగసిని ఎంచుకున్న జంటకు దగ్గరి బంధువు అయి ఉండాలి.వ్యక్తిగత,ఆరోగ్య సమస్యలతో కొందరు మహిళలు పొందలేక దుక్కి ఇస్తుంటే డబ్బున్న కొందరు సెలబ్రిటీలు ఇలా అద్దె గర్భం ద్వారా సంతానన్ని కలగటం పై ప్రజల నుంచి భిన్నభిప్రాయాలు వ్యాఖమవుతున్నాయి. ఆరోగ్యంగా వుండి, పరిస్థితులు అనుకూలంగా ఉండే ప్రతి మహిళ అమ్మతనాన్ని ఆస్వాదించాలి. కానీ ఇలా డబ్బుతో కమ్మతనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: