పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న  సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది, భీమ్లా నాయక్  సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను  కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది,  అయితే ప్రస్తుతం ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమే అనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, దానికి ప్రధాన కారణం ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండడం.  అయితే ఒకవేళ ఈ సినిమా కనుక ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కాకపోతే ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఇప్పటికే ఏప్రిల్ ఒకటవ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా, మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కార్ వారి పాట సినిమాలు కూడా ఈ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందాలు తెలియజేశాయి.  ఒకవేళ భీమ్లా నాయక్ సినిమాను కూడా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేస్తే ఈ మూడు భారీ సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీసు దగ్గర తలపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: