సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, కానీ వారిలో కొంతమంది మాత్రమే మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకని ఆ తర్వాత కూడా తమ హవాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉంటారు. ఇలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకున్న హీరోయిన్ లలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోనాంకి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకోవడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో మొదటి సినిమాతోనే శ్రీ లీల కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ దక్కింది.

ఇలా మొదటి సినిమా తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే ధమాకా సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రెండవ సినిమాతోనే రవితేజ లాంటి హీరోతో అవకాశం దక్కించుకోవడం తో  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరింత క్రేజీ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ లీల కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల , రవితేజ సినిమా తర్వాత చేయబోయే సినిమాలకు ఒక కోటి రూపాయల వరకు  రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇలా తెలుగు  ఇండస్ట్రీ లో ఒకే ఒక సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇంత రేంజ్ లో రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తుంది అని వార్తలు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: