సాధారణంగా బుల్లితెరపై నటించే నటులు వెండితెరపై నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ ని ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అప్పట్లో బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సీరియల్ అమృతం. ఈ సీరియల్ నిర్విరామంగా ఏడు సంవత్సరాల పాటు ప్రేక్షకులకు కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఈ సీరియల్ లో శివాజీ రాజా, హర్షవర్ధన్ ,నరేష్ ఇలా వీరి ముగ్గురూ సీజన్ వారీగా అమృత రావు పాత్రలో నటించారు.

ఈ సీరియల్ లో వీరి ముగ్గురిలో హర్షవర్ధన్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఆయనకు ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలలో హర్ష వర్ధన్ కి దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న సంబంధం గురించి తెలిపారు. ఇక ఆయన మాట్లాడుతూ.. నేను రాజమౌళి అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి నేను రైటర్ గా పని చేసినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేకాదు.. ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి కి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేశారని తెలిపారు. ఆ పాత్ర ఆయనకీ ఎంతో పేరు తీసుకొచ్చిందని తెలిపారు. అలాగే శాంతినివాసం సీరియల్ చేస్తున్న సమయంలోనే ఆయనకీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని తెలిపాడు.

అయితే శాంతి నివాసం సీరియల్, స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఈ రెండిటికి రాఘవేంద్ర రావు నిర్మాత, రాజమౌళి శాంతి నివాసం సీరియల్ బాధ్యతలు నాకు అప్పగించి, ఆయన సినిమాల్లోకి వెళ్లిపోయారు' అంటూ హర్ష వర్ధన్ చెప్పుకొచ్చాడు. ఇక శాంతినివాసం సీరియల్ తో మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం మొదలైందని అన్నారు. అంతేకాదు.. ఆయన రాజమౌళిని అడిగితే సినిమాలలో తప్పకుండా నాకు అవకాశం ఇస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: