తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నేటితరం హీరోయిన్ లకు కూడా తీసిపోకుండా ఉంటుంది. ఆమె అందం, అభినయం, నాట్యం అన్ని కలగలిపిన అందాలతార ఆమె. ఇక సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా ఆమె నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలనాటి స్టార్ హీరోల అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంది. హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరోవైపు రాజకీయ నాయకురాలిగా ఆకట్టుకుంది.

ఇక జయప్రద తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆమె సినీ జీవితంలో మంచి స్థాయిని సంపాదించుకున్న జయప్రద అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అంతేకాదు.. ఆమె  ఏ నిర్ణయం తీసుకున్న కరెక్ట్ గా..నిజాయితీగా తీసుకుంటుంది అని అందరూ అంటుంటారు. అయితే జయప్రద జీవితంలో ఒక్కే ఒక్క తప్పు చేసిందని.. అది కూడా సరిదిద్దుకోలేని తప్పు అని చెబుతున్నారు కొందరు. ఇక ఆమె చేసిన తప్పు కారణంగా జయప్రద జీవితం సర్వ నాశనం అయిపోయిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.

ఇంతకీ ఆమె ఏం నిర్ణయం తీసుకుందో ఒక్కసారి చూద్దామా. ఇండస్ట్రీలో ఆమె ప్రయాణం జోరుగా సాగుతున్న సమయంలో ఆమె శ్రీకాంత్ నహతా అని ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడి.. ఎవ్వరికి తెలియకుండా శ్రీకాంత్-జయప్రద ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీకాంత్‌కి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీకాంత్.. జయప్రదకు చెప్పలేదు. ఈ విషయం తెలియకపోవడంతో ఆమె అతనితో పెళ్లికి ముందే నాలుగు సంవత్సరాలుగా బాగా కలిసి తిరుగుతూ ఉండేది అని అప్పట్లో వార్తలు వినపడ్డాయి.

ఇక వారిద్దరికీ పెళ్లి అయ్యాక ఆయనకు ముందే పెళ్ళి అయ్యిందని జయప్రదకు తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఇవన్నీ  భరించలేక జయప్రద ఆత్మహత్య చేసుకోవాలని అప్పట్లో ప్రయత్నించినట్లు సమాచారం. ఆమె అప్పటి నుండి ఆయనను దూరం పెడుతూ వచ్చారంట. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని కారణాల చేత శ్రీకాంత్ మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: