సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు , ఫెయిల్యూర్ లు అనేవి సహజ ప్రక్రియ. కొన్ని సార్లు కథ , కథనం బాగున్నా అనుకోని విధంగా పలు పరాజయాలు పొందగా, అసలు ఏమాత్రం కథనం లేనటువంటి చిత్రాలు కశ్చితంగా  పరాజయం పాలవుతుంది అనే విశ్లేషణలు వచ్చిన ఆ చిత్రం ఘన విజయం సాధించి అందరిని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ప్రేక్షకుల నాడి పట్టడంలో ఇప్పటివరకు వచ్చిన విశ్లేషకుల విశ్లేషణలు చాలా వరకు తారుమారు అయ్యాయి. 



సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ హీరోకు సంతోషం తో పాటుగా వ్యక్తిగతంగా చాలా బాగా కలిసి రావడంతో అతను అది చేసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయితే ఎవరైనా బాధపడతారు కానీ సంతోషం ఎందుకు కలుగుతుంది అని ఆశ్చర్యం పోతున్నారా, ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా , అయితే కింద చదవండి ఆ హీరో గురించి. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం హావా ను ఢీకొట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హీరో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ముగ్గురు ఖాన్ లైన అమీర్ , షారుక్ , సల్మాన్ సైతం సాధించలేనన్ని రికార్డులను సొంతం చేసుకున్న ఏకైక హీరోగా అక్షయ్ కుమార్ రికార్డు సృష్టించిన విషయం భారత సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.



ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్ లోకి ప్రవేశించి తన క్రమశిక్షణ తో, స్వశక్తి తో , స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు బాలీవుడ్ లోనే అత్యధిక పారితోషకం తీసుకొనే సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ ఖిలాడి నటుడు అంటే ప్రతి ఒక్కరికీ ఆరాధన భావము కలుగుతుంది. కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ఎల్లప్పుడూ మిగిలిన వారి కంటే ముందుంటారు.దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ మనసున్న మనిషిగా కూడా అందరికి చేరువయ్యారు. 



అక్షయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య ట్విoకిల్ ఖన్నా సైతం ప్రముఖ నటి మరియు పాతతరం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా , నటి డింపుల్ కపాడియా ల గారాల పట్టి. వీరిద్దరిది ప్రేమ వివాహాం. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ చాలా వింతగా పుట్టింది. అదెలాగంటే


అక్షయ్ , ట్విoకిల్ లు పెళ్లి కాకముందు రెండు చిత్రాల్లో నటించారు. జుల్మీ చిత్రం లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటికే స్టార్ హీరోగా బాలీవుడ్ లో పాతుకుపోయిన అక్షయ్, ట్విoకిల్ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యి ఏకంగా పెళ్లికి ప్రపోజ్ చేయగా మొదట షాక్ అయిన ఆమె తర్వాత తెరుకొని ఒక షరతు విధించింది. అదేంటి అంటే తమిద్దరూ నటిస్తున్న జుల్మీ చిత్రం సూపర్ హిట్ అయితే పెళ్లి క్యాన్సిల్ , ఫ్లాప్ అయితే పెళ్లికి రెడీ అని అనడంతో అక్షయ్ సినిమా ఫ్లాప్ అవ్వాలని బాగా కోరుకుంటూ సినిమా పూర్తి చేశాడు. అక్షయ్ కోరిక మేరకు సినిమా ఫ్లాప్ అవ్వడంతో వీరిద్దరూ వివాహాం చేసుకున్నారు. వీరికి కుమారుడు ఆరావ్, కుమార్తె నితరా ఉన్నారు. అక్షయ్ సినీ , వ్యక్తిగత జీవితాల విజయాల్లో ట్విoకిల్ చాలా కీలకం .

మరింత సమాచారం తెలుసుకోండి: