సినిమా పరిశ్రమలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో ఇంత దూరం వచ్చిన ఈ హీరో ఇప్పుడు మెగా స్టార్ గా ఎదిగాడు అంటే నిజంగా అది ఆయన పడ్డ కష్టం అని చెప్పాలి. తనకే సొంతమైన మేనరిజం తో తనకే సొంతమైన స్టైల్ తో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఉర్రూతలూగించాడు. ఆ విధంగా మెగాస్టార్ గా ఎదిగి ఇప్పుడు కోట్ల మంది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశాడు చిరంజీవి.

మళ్లీ తన తప్పు తెలుసుకుని ఇప్పుడు సినిమాలు చేయడం అభిమానులను మళ్ళీ ఖుషీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో చిరంజీవి తరువాత నెంబర్ వన్ ఎవరు అనే విషయం చర్చకు వస్తుందని చెప్పాలి. కొంతమంది హీరోలు ఈ స్థానానికి పోటీగా వస్తున్న కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులు విజయ్ దేవరకొండ కే ఓటు వేయడం విశేషం. చిరంజీవి లాగే విజయ్ దేవరకొండ కూడా సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ హిట్లు సాధించి భారీస్థాయిలో అభిమానాన్ని అందుకున్నాడు.

 అలా చిరంజీవి తరహాలోనే వచ్చాడు కాబట్టి ఆయనను మరో చిరంజీవిగా అభివర్ణిస్తున్నారు కొంతమంది సినిమా విశ్లేషకు లు. మరి చిరంజీవి స్థానాన్ని విజయ్ దేవరకొండ భర్తీ చేస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లోకి లైగర్ సినిమా ద్వారా ఎంతో గ్రాండ్ గా అడుగుపెట్టబోతున్నా డు ఈ హీరో. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే భారీ స్థాయిలో ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. ఆ విధం గా విజయ్ దేవరకొండ నంబర్ వన్ హీరో గా ఎప్పుడు అవతరిస్తాడో చూడా లి. 

మరింత సమాచారం తెలుసుకోండి: