టాలీవుడ్ లో అగ్ర దర్శకునిగా కొనసాగుతున్న కొంతమంది ఇప్పుడు తమ తదుపరి సినిమాలు చేయడానికి ఎక్కువగా సమయం తీసుకుంటున్నారు. హిట్ వచ్చినా కూడా చేతిలో పెద్ద హీరో సినిమా ఉన్నా కూడా వీరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రస్తుతం యాక్షన్ చెప్పి ఏళ్ళు గడిచిపోయిన దర్శకుల గురించి మనం తెలుసుకుందాం. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురం లో అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు యాక్షన్ చెప్పి చాలా రోజులు అయిపోయింది.

ఇండస్ట్రీ హిట్ సాధించిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు మోగించిన కూడా త్రివిక్రమ్ తన తదుపరి సినిమా సెట్ చేసుకోవడానికి రెండు సంవత్సరాలకు పైగానే పట్టింది అని చెప్పవచ్చు. మధ్యలో ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాను సెట్ చేసినా కూడా అనూహ్యమైన కారణాలతో ఆ చిత్రం క్యాన్సల్ అయింది. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. తొందర్లోనే ఈ సినిమా మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. 

ఇక మహానటి సినిమా తరువాత ఒక్క సినిమా కూడా చేయలేదు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కూడా ఈ దర్శకుడు తన తదుపరి సినిమా చేయడానికి నాలుగు సంవత్సరాలకి పైగానే సమయం పట్టింది అని చెప్పవచ్చు. ప్రభాస్ తో ఆయన తదుపరి సినిమా మొదలు పెట్టిన ఆయన ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ ఉండటం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశ కు గురిచేస్తుంది. ఇక వరుణ్ తేజ్ తో హరీష్ శంకర్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమా కూడా సూపర్ హిట్ కాగా ఆ దర్శకుడు రెండేళ్ల వరకు ఒక్క సినిమాను కూడా మొదలు పెట్టకపోవడం గమనార్హం. మరి ఈ దర్శకులు ఇప్పుడు కూడా సినిమాలను మొదలుపెట్టని నేపథ్యంలో ఎప్పుడు సినిమా చేసి విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: