అక్కినేని అఖిల్ తన నాలుగవ సినిమాతో మొదటి హిట్ అందుకొని అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషపరిచాడు. అలా తొలి మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో నిరాశ పరిచిన అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకొని రేస్ లోకి వచ్చాడు. వాస్తవానికి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో ఎవరు కూడా ఈ స్థాయిలో హిట్ కోసం కష్టపడే లేదనే చెప్పాలి. కానీ అఖిల్ టైం ఏ మాత్రం అతనికి సహకరించడం లేదు.

అలా నాలుగవ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అఖిల్ ఇప్పుడు ఐదో సినిమాతో మరో హిట్ అందుకొని దానికి సిద్ధమవుతున్నాడు అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఈ సినిమాకు ఇప్పుడు కొన్ని విచిత్రమైన వార్తలు రావడం అక్కినేని అభిమానులను ఎంతగానో టెన్షన్ పెడుతుంది. ఈ సినిమా మొదలై దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి కాగా ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున కొన్ని మార్పులు చేర్పులు చెప్పి చేయమని సూచించాడట దాంతో రీ షూట్ అనగానే మన సినిమా అభిమానులు ఎంతగానో టెన్షన్ పడుతున్నారు అని తెలుస్తుంది. ఎందుకు అఖిల్ సినిమా విషయంలోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయని కూడా వారు వాపోతున్నారు. ఇండస్ట్రీకి పెద్ద హీరో గా ఎదగాల్సిన అఖిల్ ఇలా హిట్ కోసం నానా తంటాలు పడుతూ ఉండడం అభిమానులను ఏమాత్రం నచ్చడం లేదు. హిట్ కొట్టిన సమబరం లేకుండా పోయింది ఈ వార్తతో. మరి ఈ సినిమాను ఏ విధంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా అఖిల్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం భారీ స్థాయి లో సిక్స్ ప్యాక్ ను ట్రై చేశాడు అఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: