టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. పెద్ద హీరోలు అనగానే భారీ బడ్జెట్ సినిమాలే చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు పెద్ద హీరోలు చిన్న బడ్జెట్ చిన్న స్థాయి దర్శకులతో సినిమాలు చేసే విధంగా ఆలోచనలు చేస్తూ ఉండడం ఇప్పుడు కొంత ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తుంది అని చెప్పవచ్చు. అలా చిన్న సినిమాల పై మోజు పడుతున్న స్టార్ హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవలే టాలీవుడ్ సినిమా పరిశ్రమ ను ఒక్కసారిగా కనిపించిన విషయం మారుతి తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అనే విషయం.

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ప్రభాస్ చిన్న సినిమాలు చేయడం అనే సంగతి పక్కన పెడితే వందకోట్ల బడ్జెట్ సినిమాలను కూడా చేయడం లేదు. ఐదు వందల కోట్ల బడ్జెట్ సినిమాలను మాత్రమే ఒప్పుకుంటూ వచ్చిన ప్రభాస్ ఇప్పుడు మారుతి తో కలిసి చిన్న సినిమా చేయడం ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి. ఇక విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తూనే మరోవైపు చిన్న దర్శకుడితో సినిమా చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత సుకుమార్ తో ఆయన సినిమా చేస్తున్నాడు. అలా పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ విధంగా శివ నిర్వాణ దర్శకత్వంలో చిన్న సినిమా చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. వీరే కాదు ఇంకొంత మంది స్టార్ హీరోలు కూడా తొందరగా పూర్తి అయ్యే చిన్న సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో ఇదే అవకాశం అని భావిస్తున్న కొంతమంది దర్శకులు పెద్ద హీరోలకు కథలు తయారు చేసే పనిలో ఉన్నారు. మరి ఈ చిన్న సినిమాలు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: