కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్న విరుష్క జంట కు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక వీరి ప్రేమకు గుర్తుగా గారాలపట్టి వామిక పుట్టింది. దీంతో అభిమానులందరూ కోహ్లీ అనుష్క కూతురుని చూడాలని ఆత్రుత పడ్డారు. కానీ వామిక పుట్టి దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టలేదు విరాట్ కోహ్లీ-అనుష్క. ఇప్పటివరకు వామిక ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కానీ అవన్నీ ముఖం కనిపించకుండా ఉన్నవే. దీంతో ఎప్పుడెప్పుడు విరాట్ కోహ్లీ జంట తమ గారాలపట్టి వామిక ఫోటోలను సోషల్ మీడియాలో పెడతారా అని అభిమానులు కాస్త నిరీక్షణ గా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా వామిక మీడియా కంట చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డారు విరుష్క జంట. కానీ ఇటీవలే అనుకోని విధంగా వామిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. ఇటీవల దక్షిణాఫ్రికా చివరి వన్డే సందర్భంగా అనుష్క విరాట్ కోహ్లీ కుమార్తె వామిక కెమెరా కంటపడింది. దీంతో సౌత్ ఆఫ్రికాకు చెందిన కెమెరామాన్ ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల వామిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడం పై  అనుష్క శర్మ స్పందించింది. మా కుమార్తె ఫోటోలు క్యాప్చర్ కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మావైపు కెమెరా ఉంది అనే విషయాన్ని మాత్రం మేము ఊహించలేదు. ఇక వామిక గోప్యత విషయంలో మొదట్లో చెప్పినట్లుగానే మా వైఖరి ఉంటుంది అంటూ అనుష్క శర్మ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని గౌరవించి లీక్ అయిన ఫోటోలు అన్నింటిని డిలీట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది అనుష్క శర్మ. ఇక అనుష్క అభ్యర్థనతో ఎంతో మంది వామిక ఫోటోలని వెబ్సైట్ నుంచి తొలగించారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: