సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని భావించిన ఆర్ఆర్ఆర్ మరియు రాధే శ్యామ్ చిత్రాలు అనూహ్యంగా పోస్ట్ పోన్ అయ్యాయి. భారీ బడ్జెట్ లతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు పోటీ పడతాయని హీరోల అభిమానులు కూడా ఎంతగానో ఆశ పడ్డారు. ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో అని అందరూ తెగ ఆరాటపడ్డారు. కానీ ఈ సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో అవి పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే వీరు మళ్ళీ పోటీ పడతారా అన్న సందేహాలు అందరికీ కలిగాయి.

గత కొన్ని రోజుల నుంచి ఈ రెండు సినిమాలు కూడా వేరు వేరు డేట్ లను ఎంచుకుంటూ పోతున్నట్లు వార్తలు వినిపించాయి. దాంతో ఇటు ప్రభాస్ అభిమానులు అటు మెగా నందమూరి అభిమానులు అందరూ తెగ నిరాశపడ్డారు. ఇతర భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా పన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం తప్పకుండా ఎంతో ప్రెస్టీజీయస్ ప్రాజెక్టుగా తెరకెక్కింది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య టాలీవుడ్ లో ఎంతో ఆసక్తికరమైన పోటీగా నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం కలే అని అందరూ అనుకున్నారు.

కానీ విచిత్రంగా మళ్లీ ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నట్లు వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. తొందర్లోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాలు ఒకే రోజున విడుదల అవుతాయా లేదా రెండు మూడు రోజుల వ్యవధిలో విడుదల అవుతాయా అనేది చూడాలి. ఏదేమైనా రెండు భారీ చిత్రాలు పోటీ పడడం నిజంగా ఆసక్తికరమైన విషయం అనే చెప్పాలి. తొందరలోనే విడుదల తేదీ రాబోతున్న ఈ పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం అవుతుంది. దర్శకుడు రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం ఎంత పెద్ద విజయం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: