టాలీవుడ్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజుకు భారీగానే గట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి డజను సినేమలనైనా నిర్మించే సత్తా ఉన్న నిర్మాత ఆయన. దేశంలోని ఏ నిర్మాతకు సాధ్యం కాని విధంగా ఈయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అని చెప్పవచ్చు. అలా ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న వాటిలో మూడు నాలుగు ప్రాజెక్టులు చేస్తూ ఉండటం విశేషం.ఆ విధంగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు విజయ్ దళపతి మరియు వంశీపైడిపల్లి సినిమా.

ఈ చిత్రానికి విజయ్ వంద కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పటినుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఒక హీరోకి అందులోనూ సౌత్ హీరో కి అంత రెమ్యునరేషన్ అంటే చిన్న విషయం కాదు. తొలిసారిగా ఈ విధంగా సౌత్ సినిమా పరిశ్రమలో జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపద్యంలోనే దిల్ రాజు ఇంత స్థాయిలో పారితోషకం అందజేయడం నిజంగా ఆయన డేరింగ్ కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

సినిమా తొందరలోనే మొదలు కాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ తొందర్లోనే వంశీ పైడిపల్లి తో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మహర్షి సినిమా తర్వాత తెలుగు దర్శకుడు తమిళ హీరో ను ఎంచుకోవడం పట్ల వంశీపైడిపల్లి పై కొన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఖాళీగా ఉండక పోవడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర హీరోల డేట్స్ కూడా దొరికే పరిస్థితి లేదు. మరి ఇన్ని సంచలనాలను సృష్టించిన ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సౌత్ సినిమా పరిశ్రమలోనే కాదు ఇండియన్ సినిమా పరిశ్రమలో సైతం ఈ హీరోకి మంచి పాపులారిటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: