సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు రాంగ్ డెసిషన్ తీసుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఏం లాభం ఉంది. వారు తప్పు చేసేటప్పుడే ఆలోచించుకోవాలి.  కొంతమంది హీరోలు కాళ్ళ దగ్గరికి వచ్చిన హిట్ సినిమాలను వద్దనుకుంటారు. ఒకవేళ చేస్తే ఇప్పుడు వారి రేంజ్ వేరే విధంగా ఉండేది. అలాంటి తప్పు ఇప్పుడు మహేష్ బాబు ఓ దర్శకుడి విషయంలో చేశాడు. వాస్తవానికి సర్కార్ వారి పాట సినిమా కంటే ముందే మహేష్ సుకుమార్ తో సినిమా మొదలు పెట్టి పూర్తి చేయవలసి ఉంది. కానీ అనూహ్య రీతిలో ఆ చిత్రాన్ని కొన్ని నెలలకు క్యాన్సల్ చేయడం ఒక్కసారిగా సుకుమార్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది.

దాంతో మహేష్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా విమర్శలు వచ్చాయి అప్పట్లో. రంగస్థలం లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత కూడా ఆ దర్శకుడి ని నమ్మకపోవడం పట్ల మహేష్ ను చాలా మంది విమర్శించారు. అలా ఆయన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం అది కాస్త సూపర్ హిట్ కావడం దేశవ్యాప్తంగా మంచి పేరు రావడంతో ఇప్పుడు మహేష్ పై విమర్శలు రోజురోజుకు ఇంకా పెరిగిపోతున్నాయి అని తెలుస్తుంది. మంచి టాలెంటెడ్ దర్శకుడిని రిజెక్ట్ చేయడంపై మహేష్ పై చాలా విమర్శలు చేస్తున్నారు కొంతమంది.

వాస్తవానికి మహేష్ తో సినిమా చేయకపోవడమే సుకుమార్ కు మంచిది అయిందని వారు చెబుతున్నారు. ఒకవేళ మహేష్ తో సినిమా చేస్తే అది పాన్ ఇండియా వైడ్ సినిమా గా విడుదల అయ్యేదో కాదో.. అయినా కూడా పుష్ప సినిమాకు వచ్చిన స్థాయిలో పేరు మాత్రం వస్తుందో రాదో అనేది వారి వాదన.  మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ ల్ విడుదల కావడం లేదు. తెలుగు సినిమాగా మాత్రమే మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మహేష్ బాబు సుకుమార్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తే బాగుంటుందనే మంచిదని వారు చెబుతున్నారు.  మరి తొందర్లోనే ఈ కాంబో తెరపైకి రావాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: