తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ గురించి తెలిసే ఉంటుంది. ఈ షో ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే బిగ్‌బాస్ సీజన్-5 షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న నటుడు విశ్వ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. బిగ్‌బాస్ కంటే ముందు విశ్వ కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించారు. అయినా వాటిలో అంత ఫేమ్ కాలేదు. కానీ బిగ్‌బాస్ షో ద్వారా బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుని మంచి ఫాలొయింగ్‌ను క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఊహించని రీతిలో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు.అయితే.. బిగ్‌బాస్ షో అనంతరం కంటెస్టెంట్‌లు తమకు వచ్చిన పాపులారిటీని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. పలు వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. విశ్వ కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఈ ఛానల్ పేరు ‘విశ్వ అడ్డా’. తాజాగా విశ్వ హోమ్ టూర్ వీడియోను చేశాడు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.


విశ్వ.. తన ప్రజెంట్ అడ్రస్‌ను కూడా ఈ హోం టూర్ వీడియోలో తెలిపాడు. హైదరాబాద్‌లో బోయిన్‌పల్లిలోని పావని రెసిడెన్సీలో తమ ఇల్లు ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా విశ్వ తన ఇల్లును పరిచయం చేస్తూ మాట్లాడాడు. ఈ ఇంటిని 2017లో తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఆ తర్వాత ఒక ఫోటోను చూపిస్తూ.. బిగ్‌బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అని చెప్పుకొచ్చాడు. ఆ ఫోటోను ఒక చిన్నపిల్లాడు ఇచ్చిన్నట్లు పేర్కొన్నాడు. అలాగే కొందరు అభిమానులు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.


అలాగే ఇండస్ట్రీలో తనకు వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి.. క్రికెట్ మ్యాచ్‌లో గెలిచిన కప్పుల గురించి చెప్పుకొచ్చారు. తన తల్లి, తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విశ్వకు సంబంధించిన పూర్తి విషయాలు చెప్పడం కన్నా.. ఈ హోం టూర్ వీడియోను చూసేయడమే కరెక్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి ఈ హోం టూర్ వీడియోను లుక్కేయండి.


https://www.youtube.com/watch?v=W3_nok8qRJg

మరింత సమాచారం తెలుసుకోండి: