యువ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా లైగర్. తొలిసారిగా తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లిచూపులు మూవీ ద్వారా హీరోగా మారిన విజయ్, ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అనంతరం సందీప్ రెడ్డి వంగా తీసిన నాచురల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అర్జున్ రెడ్డి మూవీలో నటించి ఆ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారారు విజయ్ దేవరకొండ. అనంతరం వచ్చిన గీత గోవిందం సూపర్ సక్సెస్ హీరోగా ఆయన రేంజ్ మరింతగా పెంచింది.
అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న విజయ్ నటిస్తున్న లైగర్ భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండగా పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలపై పూరి, కరణ్ జోహార్ ఎంతో భారీగా నిర్మిస్తున్న లైగర్ లో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర చేస్తుండగా బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల రిలీజ్ అయిన లైగర్ టీజర్ అందరి నుండి బాగా క్రేజ్ దక్కించుకోవడంతో లైగర్ శాండ్ ఆర్ట్ ని వేసి విజయ్ పై తన ప్రేమని చూపించుకున్నారు శాండ్ ఆర్టిస్ట్ దశరథ్ మొహంతా. స్వతహాగా మంచి పేరున్న శాండ్ ఆర్టిస్ట్ అయిన మొహంతా, సగం విజయ్ దేవరకొండ ముఖం, మరొక సగం మైక్ టైసన్ ముఖం కనిపించేలా వేసిన లైగర్ శాండ్ ఆర్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక నేడు ఉదయం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సైతం ఈ శాండ్ ఆర్ట్ తాలూకు ఫోటోలు ఎంతో వైరల్ అవుతూ ఉండడంతో, అందరూ దశరథ్ టాలెంట్ ని ఎంతో అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా లైగర్ మూవీ ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: