సినిమా అవకాశాలు తగ్గడం తో మన హీరోయిన్ లు కొత్త రూట్ ఎంచుకున్నారు. ఓ టీ టీ లో అవకాశాలు సంపాదించుకుంటున్నారు. అక్కడ హిట్స్ సాధిస్తూ పాతుకు పోతున్నారు.ఫేడ్ అవుట్ అయిపోయిన భామలు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ సినిమా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ విధంగా సమంత ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఫ్యామిలీ మెన్ సిరీస్ లో కీలక పాత్రలో నటించగా ఆ తర్వాత కాజల్ కూడా హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అనే హారర్ వెబ్ సిరీస్ లో నటించింది. అగ్ర హీరోయిన్ గా ఉన్న వీరిద్దరూ అగ్రహీరోయిన్స్ గా ఉన్న సమయంలోనే ఇలా నటించడం వారి అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది.

ఆ విధంగా ఇప్పుడు చాలా మంది హీరోయిన్ లు అదే బాటలో ముందుకు వెళుతున్నారని చెప్పాలి.  ఇక టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగొందిన తమన్నా కూడా ఓ టీ టీ లో వరుసగా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ఇప్పుడు నాలుగైదు ప్రాజెక్టులు ప్రాజెక్టులు అంటూ ఫుల్ బిజీగా ఉన్నారు అలాగే హీరోయిన్లు చేస్తూ మళ్లీ సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా వీరు మంచి మంచి అవకాశాలతో బిజీగా ఉండటం వారి అభిమానులను చాలా సంతోషపరుస్తుంది అని చెప్పాలి.

ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందచందాలతో నటనతో ఎంతగానో ఆకట్టుకున్న త్రిష కూడా ఇప్పుడు ఓటీటీ బాటలో పయనిస్తున్నదని తెలుస్తుంది. తొందర్లోనే ఓ వెబ్ సిరీస్ లో ఈమె నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె నటించిన సినిమాలు కొన్ని డైరెక్ట్ గా ఓ టీ టీ విడుదల అయ్యాయి. కానీ ఓ టీ టీ కోసమే ఆమె ఇప్పుడు ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పెద్ద హీరోయిన్ లు ఈ రకమైన సినిమాలు చేస్తున్న నేపథ్యంలో సినిమా అవకాశాలు పెద్దగా లేని ఈమె ఈ తరహా సినిమాలు చేయడం పెద్ద వింతేమీ కాదు. ఏదేమైనా ఆమె ఇంకా తన సినిమా కెరీర్ కొనసాగడం ఆమె అభిమానులను ఖుషీ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: