సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్నాడు సూర్య. మొదటి తమిళ సినిమా పరిశ్రమకు మాత్రమే ఆయన సినిమాలు పరిమితం అయ్యేవి. ఎప్పుడైతే ఆయనకు అక్కడ స్టార్ హీరో అనే ప్రమోషన్ వచ్చిందో అప్పటినుంచి సూర్య తన సినిమాలను అన్ని భాషలలో విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేశాడు. అలా తెలుగులో సైతం ఆయనకు మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అయ్యే విధంగా చూసుకుని సూపర్ హిట్లు సాధించి ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు.

తెలుగులో కూడా ఆయనకు భారీ మార్కెట్ ఉందని చెప్పవచ్చు. పెద్ద హీరో ల తో పోటీ పడుతూ ఆయన సినిమాలు ఇక్కడ విడుదల అవుతాయి. ఆ విధంగా ఆయన హీరోగా నటించిన 24 చిత్రం ప్రేక్షకులను విపరీతంగా నచ్చింది అని చెప్పవచ్చు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాక పోయినా కూడా కాన్సెప్ట్ పరంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి వారికి సరికొత్త అనుభూతిని కలిగించాదని చెప్పవచ్చు. 

అయితే విక్రమ్ కుమార్ కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీయడంలో మాత్రం విఫలమయ్యాడు. అందుకే ఆ సినిమా కొంత మంది ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని బయటకు రావడం పట్ల అభిమానులు కొంతమంది ఆనంద పడుతున్నా ఇంకొంత మంది ఈ సినిమాకు సీక్వెల్ చేయడం అవసరమా అని వారు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సూర్య నటించిన జై భీమ్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. భారతీయ సినిమా పరిశ్రమ వేరొక రేంజ్ లోకి తీసుకు వెళ్ళే హీరోగా ఇప్పుడు సూర్య మంచి కితాబు అందుకుంటున్నాడు. ఇక పాండిరాజ్ దర్శకత్వంలో ఆయన హీరోగా చేసిన ఈటీ చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: