కొంతమంది హీరోలు ఎంత ట్రై చేసినా కూడా హిట్ అనేది వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. వారు థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. సరైన మార్కెట్ లేకపోవడంతో వారి సినిమాలు సరిగా ఆడకపోవడంతో వారి నిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు అని చెప్పాలి. దాంతో కొంతమంది సినిమా విశ్లేషకులు సదరు హీరోలు నిర్మాతలను ఇబ్బంది పెట్టే విధంగా థియేటర్లలో కాకుండా తమ సినిమాలను ఓ టీ టీ లలో విడుదల చేస్తే మంచిదని వారు చెబుతున్నారు.ఆ హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం.

వరుస ఫ్లాపులతో సతమతమవుతు ప్రేక్షకులను ఎంతగానో నిరాశపరుస్తున్నాడు హీరో నాగశౌర్య. ఆయన వెరైటీ వెరైటీ టైటిల్స్ తో ప్రేక్షకులను అలరించే సినిమాల కథలతో ముందుకు వస్తున్న కూడా అవి విడుదలైన తర్వాత వారిని చిన్న స్థాయిలో కూడా అలరిచకపోవడం ఆయన నిర్మాతలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో ఆయన ఓ టీ టీ లో సినిమాలు చేసుకుంటే మంచిదని కొంత మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే సందీప్ కిషన్ కూడా ఇటీవల కాలంలో మంచి సినిమాలను చేయకుండా ప్రేక్షకులను నిరాశపరుస్తూన్న నేపథ్యంలో ఆయన కూడా ఓ టీ టీ సినిమా చేయాలని చెబుతున్నారు.

అంతేకాదు రాజ్ తరుణ్ కూడా ఓ టీ టీ కంటెంట్ సినిమాలు  చేయడం మంచిదని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.అలా కొంత క్రేజ్ సంపాదించుకున్న తర్వాత థియేటర్ సినిమా చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. వీరే కాదు కొంతమంది సక్సెస్ లేని హీరోలు కూడా ఈ విధమైన ఆలోచన చేస్తే వారి కెరియర్ కు మంచిదని వారు చెబుతున్నారు. అలా మన హీరోలు ఓ టీ టీ సినిమాలు చేస్తారా లేదా తమపై తమకు నమ్మకం కోల్పోకుండా మంచి సినిమాలను చేసి థియేటర్లలో ఆ చిత్రాన్ని విడుదల చేసి భారీ స్థాయిలో హిట్ అందుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతం మంచి మంచి సినిమాల తోనే ఈ హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండగా ఆ సినిమాల విజయం వారి కెరీర్ ను నిర్ణయిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT