రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వాస్తవానికి ఈపాటికి థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండాల్సింది. అయితే మధ్యలో కరోనా మహమ్మారి నూతన వేరియంట్ ఓమిక్రాన్ మన దేశంలో కొన్నాళ్లుగా పంజా విసరడంతో ఒక్కసారిగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఉదృతంగా పెరిగాయి. దానితో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఎక్కడికక్కడ సినిమా థియేటర్స్ అక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించాయి. దానితో చేసేది లేక ఆర్.ఆర్.ఆర్ సహా అనేక సినిమాలు రిలీజ్ ని నిలుపుదల చేసిన విషయం తెల్సిందే.

కొన్ని సినిమాలు అక్కడక్కడా రిలీజ్ అయినప్పటికీ ఆర్ ఆర్ఆర్ వంటి భారీ ఖర్చు పెట్టిన పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయడం వలన నష్టాలు తప్పవని, అందుకే మూవీని వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే ఇటీవల తమ సినిమాని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఆర్ఆర్ ఆర్ యూనిట్ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. తొలిసారిగా ఒక భారీ సినిమా ఈ విధంగా రెండు రిలీజ్ డేట్స్ కేటాయించడం ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రధమం అని, అయితే ప్రస్తుత ఈ కరోనా పరిస్థితులకు భయపడే ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇలా రెండు డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే విషయం ఏమిటంటే, ఈ రెండు డేట్స్ లో ముందు డేట్ అయిన మార్చి 18 నే ఆర్ఆర్ ఆర్ సినిమా పక్కాగా రిలీజ్ చేయాలని పలువురు ప్రేక్షకాభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ చాలా లేట్ అయిందని, వీలైనంత త్వరగా మూవీని రిలీజ్ చేస్తే తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని, ఒకవేళ రిలీజ్ మరింతగా ఆలస్యం అయితే సినిమా పై అందరిలో ఆసక్తి సన్నగిల్లే ఛాన్స్ కూడా లేకపోలేదని వారు అంటున్నారు. ఈ విధంగా జక్కన్న అండ్ టీమ్ ప్రకటించిన రెండు డేట్స్ లో మొదటి డేట్ కె సినిమా రిలీజ్ చేయాల్సిందే అంటూ గట్టిగా షాక్ ఇచ్చారు ఆడియన్స్. మరి ఆర్ఆర్ఆర్ సినిమా ఆరోజున థియేటర్స్ లోకి వస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: