సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు, కొంతమంది హీరోలకు సరిగ్గా సెట్ అవుతుంది, వారు ఇద్దరు కలిసి ఎన్ని సార్లు సినిమాలు తీసిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ సినిమాలు గా నిలుస్తూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్ లలో ఒకటి బాలకృష్ణ , బోయపాటి లది,  వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఫుల్ మాస్ ప్లస్ ఫామిలీ ఎంటర్టైనర్ లే. సింహ సినిమాతో మొదటి సారి వీరిద్దరూ కలిసి పని చేశారు, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయం సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ సినిమా తెరకెక్కింది, ఈ సినిమా కూడా అదిరిపోయే విజయం సాధించడం మాత్రమే కాకుండా అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంసలు పొంది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

 అయితే ఆ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 2 వ తేదీన విడుదల అయ్యింది,  ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది. అయితే ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి, అయితే ఈ  మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది... అది ఏంటంటే... ఈ మూడు సినిమాల్లో కూడా బాలకృష్ణ డ్యూయల్  రోల్ చేయడమే, ఇలా ఈ సినిమాలో ఈ కామన్ పాయింట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమాలు విపరీతంగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: