రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు, అయితే బాహుబలి సినిమాతో వచ్చిన  క్రేజ్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా, అంతకుమించిన సినిమాలలో నటిస్తున్నాడు, అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ 'సాహో' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు, ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది, అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేసింది.  ప్రభాస్ ఈ సినిమాలతో  పాటు సలార్, ఆది పురుష్ సినిమాలలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలే.  ప్రభాస్ ఈ సినిమా తో పాటు ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు, ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోంది, అలాగే ప్రభాస్ ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా స్పిరిట్ మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, డివివి దానయ్య నిర్మాతగా తెరకెక్కబోయే  సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, అయితే ప్రభాస్ ఈ సినిమాకు కమిట్ కావడానికి కారణం 50 కోట్ల సింగిల్ పేమెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి, 100 కోట్ల రెమ్యూనిరేషన్, యాభై కోట్ల అడ్వాన్స్ అనే డీల్ కారణంగానే ప్రభాస్మూవీ కి కమిట్ అయ్యాడు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: