యంగ్ హీరోల్లో ఒక‌రైన శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. గ‌త కొంత కాలం నుండి బ్యాట్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నా కానీ స‌రైన హిట్ మాత్రం అందుకోలేక‌పోతున్నాడు ఈ కుర్ర కారు హీరో. ఈ త‌రుణంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు శ‌ర్వానంద్‌. కెరీర్ ప్రారంభం నుంచి త‌న‌దైన శైలిలో విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌స్తున్నాడు శ‌ర్వానంద్‌. ఈ త‌రుణంలోనే  ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాను చేస్తూ ఉన్నాడు.

ఇక ఇటీవ‌లే విడుద‌లైన మ‌హాస‌ముద్రం సినిమాపై హీరో శ‌ర్వానంద్ భారీ అంచెనాల‌నే పెట్టుకున్నారు. ఆ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్లు కూడా ఓ రేంజ్‌లో చేసారు. అయితే ఆ సినిమా ఆశించినంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేక‌పోయింది. దీంతో ఇప్పుడు ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉంచాడు శ‌ర్వానంద్‌. ఒకే ఒక జీవితం చిత్ర‌మును డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్ బ్యాన‌ర్ నిర్మిస్తుండ‌గా.. రీతూ వ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అదేవిధంగా ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో అక్కినేని అమ‌ల కూడా న‌టిస్తున్నారు.

ఈ చిత్రం ఒకే టైమ్ ట్రావెల్ క‌థ‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ బైలింగ్విల్ సినిమాతో శ్రీ‌కార్తీక్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అమ్మ‌పాట‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైంది చిత్ర యూనిట్‌. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 26న సాయంత్రం 5 గంట‌లు ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వ‌దిలిన ఓ అనౌన్స్ మెంట్ పోస్ట‌ర్ ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. జేక్స్ బీజోన్ ఈ పాట‌కు ట్యూన్ స‌మ‌కూర్చ‌గా.. దివంగ‌త లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి సాహిత్య‌మును అందించారు. యంగ్ మ్యూజిగ్ సెన్సేష‌న్ సిద్ శ్రీ‌రామ్ ఈ పాట‌ను పాడారు.  ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌. ప్రకాశ్ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: