తెలుగు చిత్ర పరిశ్రమలో కుర్ర హీరో లకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ హీరో అంటే ప్రముఖంగా వినిపించే పేరు కింగ్ అక్కినేని నాగర్జున.. ఈయన ఎప్పటి నుంచో సినిమాలు చెస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుస సినిమలలొ నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత కొన్నెల్లుగా నాగ్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు. ఇటీవల నటించిన బంగార్రాజు సినిమా తో భారీ హిట్ ను అందుకున్నాడు.. సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రుపొందిందిన సంగతి అందరికి తెలిసిందే.. సినిమా తర్వాత నాగార్జునథ్రిల్లర్ మూవీలో నటించనున్నారు. ‘


ది ఘోస్ట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.. ఈ ఏడాది చివరి లోగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్రయూనిట్ వున్నట్లు తెలుస్తుంది. నాగ్ వయసు ఆరు పదులు దాటినా కూడా ఇప్పటికీ నవ మన్మధుడు అంటూ లేడీ ఫ్యాన్స్ తో అనిపించుకుంటున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగర్జున మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇక పై కూడా చేసే ఉద్దేశం లేదట నాగార్జునకి.


స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే కథలను ఆయన ఇకమీదట చెయనని తేల్చి చెప్పారు. స్పోర్ట్స్ డ్రామా కథతో నాగార్జున సినిమా చేసేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తుంది. ఈ వయసులో అలాంటి సినిమాలు నేను చేయలేను అనిచెప్పకనే చెప్పారట. ఇకపోతే స్పోర్ట్స్ మూవీ అంటే ఫిట్నెస్ ఒక్కటే కాదు కాబట్టి అలాంటి సినిమా చేయను అని నాగార్జున చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి..కుర్ర హీరోలతో  కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం కుర్ర హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.మరింత సమాచారం తెలుసుకోండి: