ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభంజనం ఇప్పుడు దేశమంతటా విస్తరించింది. పుష్ప తో బాక్సాఫీస్ పై బన్నీ తన రేంజ్ ఏంటన్నది చూపించాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో మల్టీస్టారర్ సినిమాలపై తన అభిప్రాయాన్ని చెప్పాడు అల్లు అర్జున్. నేషనల్ స్టార్ గా ఎదిగిన తను సోలోగానే సత్తా చాటుతా అంటున్నాడు. ఇప్పుడే మల్టీస్టారర్ జోలికి వెళ్లను అంటున్నాడు అల్లు అర్జున్. కంటెంట్ ఉన్న సినిమాలనే కమర్షియల్ పంథాలో చేస్తూ తన స్టామినా మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. నార్త్ సైడ్ పుష్ప సినిమాని ఓ రేంజ్ లో అక్కడ ఆడియెన్స్ ఆదరించారు. అందుకే ఇక మీద తన సినిమాలన్ని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. అసలైతే పుష్ప తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా ఉండాల్సింది. కానీ ఆ సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ మాత్రం లేదు. ఇక పుష్ప పార్ట్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఇదిలాఉంటే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా వస్తుందని చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుందట. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ కి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందిస్తారని టాక్. చూస్తుంటే అల్లు అర్జున్ కూడా ప్రభాస్ తరహాలో నేషనల్ లెవల్ లో ఓ రేంజ్ స్టార్ గా మారే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ ప్లాన్ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్ గా తన వీర లెవల్ రేంజ్ చూపించేలా ఉన్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: