దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంతటి స్థాయి ప్రతిభ కలిగి ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఆయన చేసే సినిమాలు తక్కువే అయినా కూడా ఆయనకు భారీ స్థాయిలో ఆయనకు పేరు ప్రఖ్యాతులు తీసుకువ చ్చాయి సదరు సినిమాలు. ఆయన దర్శకత్వం వహించిన మహర్షి సినిమా కు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. దానికి మహేష్ బాబు హీరో కావడం నిజంగా ఆ సినిమా స్థాయిని భారీగా పెంచింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ మహేష్ బాబు తోనే ఆయన సినిమా చేస్తున్నాడనే వార్తలు అప్పట్లో బాగా వచ్చాయి.

కానీ అనూహ్యంగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాను ఓకే చేశాడు. పరశురామ్ లాంటి ఓ మీడియం రేంజ్ సినిమాల దర్శకుడునీ మహేష్ నమ్మాడు కానీ తనకు మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేసిన దర్శకుడు నీ మాత్రం నమ్మలేదు. అయినా మహేష్ తో రాసుకుని పూసుకుని తిరగడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దాంతో వీరిద్దరి అనుబంధం ఏంటనేది ఎవరికీ తెలియకుండా పోయింది. ఏ ఫంక్షన్ కి వెళ్ళిన ఏ ఈవెంట్ కి వెళ్లిన ఈ దర్శక హీరోలు ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.  అంతే కాదు ఆహా లో ప్రసారమైన అన్ స్టాపబుల్ షో లో కూడా మహేష్ తో వంశీ హాజరయ్యాడు. దీన్ని బట్టి వారి మధ్య ఎంత అనుబంధం ఉంది అర్థమవుతుంది.

అలాంటప్పుడు సదరు హీరో సదరు దర్శకుడికి అవకాశం ఇవ్వడం లో ఏమాత్రం కూడా ఆలోచించడు. కానీ వంశీ పైడిపల్లి కి సినిమా ఇవ్వకుందా మహేష్ ఆలోచించడం పట్ల ఆయన వైఖరి ఎవరికీ ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ దళపతి తో సినిమా చేస్తున్నాడు వంశీ పైడిపల్లి. వాస్తవానికి ఈ సినిమా కథను మహేష్ కే వినిపించాడు. అయితే ఎందుకో ఆ సినిమాను మాత్రం చేయలేకపోతున్నాడు. మరి వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: