దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా గా నటించగా అజయ్ దేవ్ గన్,  సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించారు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ  సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నకొద్దీ దేశంలో కారోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలని చిత్ర బృందం వాయిదా వేశారు, అయితే తాజాగా ఈ సినిమాను మార్చి 18 వ తేదీన లేదా, ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఏ సినిమాలోనైనా ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ రెండు ఉంటాయి, ప్రీ క్లైమాక్స్ లో  ఎమోషనల్ గా సినిమా సాగితే, క్లైమాక్స యాక్షన్ సన్నివేశాలతో సాగుతోంది.  అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ రెండు కూడా యాక్షన్ సన్నివేశాలతోనే సాగుతాయట, దాదాపు ప్రీ క్లైమాక్స్ ,  క్లైమాక్స్ కలిపి 40 నిమిషాల పాటు ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 30 శాతం వరకు ఈ నలభై నిమిషాల కోసమే ఖర్చు పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి, ఇలా ఈ సినిమాకు సంబంధించిన ఈ వార్త బయటకు రావడం తోనే వెండితెరపై ఈ యాక్షన్ సన్నివేశాలు ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: