సాధారణంగా చిత్ర పరిశ్రమలో వాళ్లు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకుని విడిపోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు ఒకటికి మించిన పెళ్లిళ్లు చేసుకున్నారు, వారు ఎవరో ఒక్కసారి చూద్దామా.

తెలుగు ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ సీనియర్ ఎన్టీఆర్  20 ఏళ్ల వయస్సులోనే తన మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. బసవతారకం 1985లో గైనిక్ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్‌స్టార్ కృష్ణంరాజుకు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య సీతా దేవి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇక లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరిని పెళ్లి చేసుకొని మరో నటితో సహజీవనం చేశారు. ఆయన మొదట వాణీగణపతిని వివాహం చేసుకోగా.. తరువాత నార్త్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఉన్న సారికను పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత హీరోయిన్ గౌతమితో సహజీవనం చేశాడు. టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున మొదటగా లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఆయన హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నాడు.

ఇక హీరో శరత్‌బాబు ముందుగా తనకంటే వయస్సులో పెద్దది అయిన రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ విడిపోయాక ఆయన స్నేహలతను పెళ్లి చేసుకున్నారు. స్నేహలతతో విడాకులు తీసుకోని మరో జర్నలిస్టుని పెళ్లి చేసుకున్నాడు. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ముందుగా లలితకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ విడిపోయాక  బాలీవుడ్ డ్యాన్సర్ పోనీవర్మను పెళ్లి చేసుకున్నాడు. ;అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రష్యా అమ్మాయి అన్నా లెజ్నోవానుతో జీవనం సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: