కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చిన్న సినిమాలను మొదలుకొని పెద్ద సినిమాలు వరకు థియేటర్లను మినహాయించి ఓటీటీలలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టుకుంటున్నాయి ఈ సినిమాలు.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు కూడా తమ సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలలో విడుదల చేసి కొంత వరకు లాభం పొందారని చెప్పవచ్చు. తాజాగా కూడా పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల అయి.. అక్కడ కొన్ని వారాల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచి.. ఇప్పుడు తాజాగా ఓటీటీ లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

అయితే మరి కొన్ని సినిమాలు అయితే  నేరుగా ఓటీటీలలో విడుదల అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ప్రతివారం సరికొత్త సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ఇక తాజాగా ఓటీటీ వేదికగా నెట్ ఫ్లెక్స్, అమెజాన్ ప్రైమ్ , డిస్నీ హాట్ స్టార్, వూట్ వంటి మరికొన్ని  ఛానెల్స్ లో సినిమాలు విడుదలవుతున్నాయి. ఇకపోతే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో  అలాగే థియేటర్లలో వస్తున్న సినిమాల జాబితా మనం తెలుసుకుందాం.

1. గుడ్ లక్ సఖి:
కీర్తి సురేష్ ప్రధానపాత్రలో ఆది పినిశెట్టి , జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న సినిమా గుడ్ లక్ సఖి.. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ నిన్న విడుదల అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. జనవరి 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

2.గ్యాంగ్స్ ఆఫ్ 18:
మలయాళ మెగా స్టార్ హీరో మమ్ముట్టి నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ 18' సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి  26 వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో ఆర్య, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

3.సామాన్యుడు:
విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా కారణంగా వాయిదా పడడంతో ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందు విడుదల కాబోతోంది.ఈ  సినిమాలో డింపుల్ హాయతి హీరోయిన్ గా నటిస్తోంది.


వీటితో పాటు గోర్ మాటి  అనే సినిమా జనవరి 26.. దెయ్యంతో సహజీవనం సినిమా జనవరి 28, క్షుద్రశక్తుల మంత్రగత్తెలు అనే జనవరి 29న థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఓ టీ టీ విషయానికి వస్తే ..
1.అర్జున ఫల్గుణ:
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 31వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి హిట్ టాక్  ను అందుకున్న ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: