మొన్నటివరకు సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలక్రిష్ణ ఇటీవలే ఏకంగా హోస్టు గా అవతారమెత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలుగు ఓటీటి ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా 'అన్ స్టాపబుల్' అనే కార్యక్రమంలో హోస్ట్ గా అవతారమెత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు బాలకృష్ణ. ఇక ఎవరూ ఊహించని రీతిలో తన వాక్చాతుర్యంతో అదరగొట్టాడు అని చెప్పాలి. మహా మహా యాంకర్లకు సైతం సాధ్యం కాని స్పాంటేనియస్   పంచులతో ప్రేక్షకులందరినీ అలరించాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే.


 అయితే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' కార్యక్రమంలో ఇక మొదట మంచు ఫ్యామిలీ ని స్పెషల్ గా పిలవడంతో ఈ కార్యక్రమం పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ హోస్టింగ్ నైపుణ్యాలు అయితే ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసాయ్ అని చెప్పాలి. తనదైన శైలిలో షోని ప్రజెంట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు బాలకృష్ణ. ఇక  'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ ముగియ బోతోంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అంతా 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి మొదటి ఛాయిస్ బాలకృష్ణ కాదు అంటూ  టాక్ వైరల్ గా మారిపోయింది.


 బాలకృష్ణ కంటే ముందే మేకర్స్ మరో ఇద్దరు హీరోలను కూడా ఈ కార్యక్రమంలో హోస్ట్ గా సంప్రదించారట. జోవియల్ నేచర్, అదిరిపోయే సెన్సాఫ్ హ్యూమర్ లో బాగా పేరు తెచ్చుకున్న వెంకటేషష్ ను ఇక ఈ కార్యక్రమంలో హోస్ట్ గా తీసుకు వస్తే మరింత హైప్ వస్తుందని నిర్వాహకులు భావించారట. కాని 'కరోనా' వైరస్ కారణంగా వెంకీ మామ షో చేయడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత గతంలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన అనుభవం ఉన్న నాచురల్ స్టార్ నాని ని సంప్రదించారట. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నానీ కూడా నో చెప్పేశాడట. దీంతో ఇక ఈ ఆఫర్ బాలయ్య వరకు వెళ్ళిందట. ఇక బాలయ్య క్రేజ్ షో కి బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం చూసుకుంటే బాలయ్య కాకుండా వేరే హీరో చేసి ఉంటే ఈ షో అంతలా హిట్ అయ్యేది కాదేమో అన్నంతగా అదరగొట్టి షో సక్సెస్ అయ్యేలా చేశాడు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: