టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మోస్ట్ అవైటెడ్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది 'ఆర్ ఆర్ ఆర్' మూవీ. ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ప్రకటించగానే అందరూ షాకయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలను రాజమౌళి ఏమాత్రం అటు ఇటుగా చూపించినా ఫ్యాన్స్ వార్ తప్పదని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి మాత్రం ఇద్దరు హీరోలను హ్యాండిల్ చేసిన విధానం ఫాన్స్ కి కూడా విపరీతంగా నచ్చింది. సినిమాలో వీరిద్దరిలో ఒకరి పాత్ర ఎక్కువ.. ఒకరి పాత్ర తక్కువ కాకుండా ఇద్దరినీ సమానంగా చూపించి ఎక్కడ కూడా తప్పకుండా ఈ సినిమాని తెరకెక్కించాడు రాజమౌళి. 

ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి అందరికీ ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఎప్పటినుండో ఉంది. సినిమాలో ఇద్దరి పాత్రలు సమానంగా రూపొందించిన రాజమౌళికి ఈ ఇద్దరిలో ఎవరి పాత్ర ఎక్కువ ఇష్టం అనే విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అయితే వారి ప్రశ్నలకు ఇన్నాళ్లకు సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకి రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పోషించిన పాత్రల్లో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత రాజమౌళికి ఎక్కువ ఇష్టమని చెప్పాడు.

దాంతో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఎందుకు ఎక్కువ ఇష్టం అనేది మాత్రం సినిమా చూస్తేనే అర్థమవుతుంది అంటున్నాడు రాజమౌళి. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమాని మార్చి లేదా ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: