పుష్ప సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డం ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దీంతో బన్నీ ముందు ముందు చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కానున్నాయి. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగి పోతుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రముఖ తమిళ ప్రొడక్షన్స్ సంస్థ లైకా వారు అల్లుఅర్జున్ తో ఏకంగా వంద కోట్లకు ఒప్పందం చేసుకున్నారు అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయమై అల్లు అర్జున్ పి ఆర్ టీం అనధికారికంగా స్పందించడం జరిగింది.

 లైకా ప్రొడక్షన్స్ లో బన్నీ సినిమా కమిట్ అయి చాలాకాలమే అవుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సినిమాలు చేసేందుకు వారు సిద్ధం చేయిస్తున్నారు. అయితే సినిమా కమిట్ అయిన సమయంలో రెమ్యునరేషన్ గురించి చర్చ ఉండదు. అడ్వాన్స్ గా మాత్రమే కొంత మొత్తం ఇస్తారు. కనుక రెమ్యూనరేషన్ మొత్తాన్ని సినిమా స్టార్ట్ అయ్యే సమయంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యేది ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాబట్టి బన్నీ రెమ్యునరేషన్ గురించి ఇప్పటి నుండే చర్చ జరిగే అవకాశం లేదంటూ' బన్నీ పి ఆర్ టీం క్లారిటీ ఇచ్చారు.

 అయితే అల్లుఅర్జున్ కి మాత్రం వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి ఉందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు కాకున్నా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే సమయం వరకు అయినా కూడా లైకా ప్రొడక్షన్స్ వారు ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టును చేయబోతున్నారు కాబట్టి కచ్చితంగా అల్లు అర్జున్ కి 100 కోట్ల పారితోషికం ఇవ్వాల్సిందే అన్నట్లుగా ఈ వార్త తెలిసిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇటీవల పుష్ప రెండు పార్ట్ లకు సంబంధించి ఇప్పటికే రెమ్యూనరేషన్ కమిట్ అయ్యాడు. రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో కూడా బన్నీకి వాట దక్కినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప పార్ట్-2కి కూడా బన్నీకి లాభాల్లో కూడా వాటా ఉంటుందట. మొత్తం మీద పుష్పక బన్నీ క్రేజ్ మాత్రం భారీగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: