టాలీవుడ్ లో ఇన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' విడుదల విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ రివీల్ అయింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో నెలకొంది.అందుకే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. 

అయితే తాజాగా వాటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారమే ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. ఈ మేరకు ఒక రోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 24 వ తారీఖున ఈ సినిమా ప్రీమియర్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అమెరికాతో పాటు పలు దేశాల్లో భీమ్లా నాయక్ ప్రీవియర్స్ ఉండనున్నట్లు  తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా వల్ల సినిమా వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దాంతో ఈ సినిమా ప్రీమియర్స్ ని భారీ రేంజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనున్ కోషియం' అనే సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్రీమేక్ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా త్రివిక్రమ్ ఈ ఈ రీమేక్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ భారీ రెస్పాన్స్ ని అందుకోవడం తో పాటు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏమిరా అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: