ఇటీవల బాక్సాఫిస్ ను షేక్ చేసిన సినిమాలలో ముఖ్యంగా వినిపించే సినిమా పుష్ప.. అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా.. లెక్కల మాస్టారు డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత నెలలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కాగా, ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.


దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ బన్నీకి క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు నార్త్‏లో అల్లు అర్జున్ పాపులారిటీ భారీగా పెరిగింది. ఈ సినిమా లో పాటలు గురించి చెప్పాలంటే మాటలు రావు. అంత పెద్దగా క్రేజ్ ను అందుకున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా లో పుష్ప సాంగ్ గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. దాక్కో దాక్కో మేక… శ్రీవల్లి.. ఊ అంటావా మావ పాటలకు నెటిజన్స్ ఓ రేంజ్ లో స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియా లో రచ్చ చేస్తున్నాయి..


సినిమా లోని సాంగ్స్ కు విదేశీయులు ఎక్కువగా ముగ్దులు అయిపొతున్నారు. స్టార్ క్రికెటర్స్ నుంచి పెద్ద సెలెబ్రిటీల మొన్నటి వరకూ రచ్చ చేశారు. ఇప్పుడు మరొకరి ఈ సినిమాలొని పాటకు డ్యాన్స్ వేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పోర్చు గీసుకు చెందిన తండ్రి కూతురు శ్రీవల్లి పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియను ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా చూసారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు కూడా ఒకసారి చూడండి... పుష్ప 2 సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది.. ఆ సినిమా ఎంత ఫెమస్ అవుతుందో చుడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: