కొన్ని సినిమాల్లో హీరో రేంజ్ కి తగినట్టుగా సింపుల్ గా అనిపించే సన్నివేశాల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే సన్నివేశం వేరే సినిమాలో చాలా సింపుల్ ఖర్చుతో అయిపోతుంది. ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ సీన్ రీసెంట్ గా రిలీజైన పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో జరిగాయి. పుష్ప లో ఆ ఒక్క సీన్ కోసం 2 కోట్ల దాకా ఖర్చు పెడితే శ్యామ్ సింగ రాయ్ సినిమాలో మాత్రం కేవలం 20 వేలతో ఆ సీన్ పూర్తి చేశారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ అదే సీన్ అంటే మాత్రం పుష్ప లో ఎర్రచందనం లారీని దాచి పెట్టేందుకు పుష్ప రాజ్ ఎర్రచందనం దుగలతో లారీని బావిలో పడేస్తాడు.

ఆ సీన్ భారీగా వచ్చేందుకు దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారట. అయితే అలాంటి సీన్ కాకపోయినా  శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా ఒక బావి సీన్ ఉంటుంది. దళితుడు బావి నీళ్లు తాగాకూడదు అనే సందర్భంలో వచ్చే ఆ సీన్ లో శ్యామ్ సింగ రాయ్ ఏకంగా అతన్ని బావిలో పడేస్తాడు. అయితే ఈ సీన్ లో కూడా నీళ్ల బావి ఉంటుంది. ఈ బావి కోసం కేవలం 20 వేలు మాత్రమే ఖర్చు పెట్టారట. మిగతా అంతా గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేశారట. అయితే శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈ సీన్ చాలా నీట్ గా గ్రాఫిక్స్ అనే భావన ఎక్కడ కలగకుండా చూపించారు.

శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నీళ్లు తాగే బావి కోసం 20 వేలు మాత్రమే ఖర్చు పెడితే.. పాడుబడ్డ్డ బావి కోసం మాత్రం పుష్ప సినిమాలో 2 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. పుష్ప బడ్జెట్ కు తగినట్టుగా ఆ సీన్ కి అంత పెట్టడం కామనే అయినా శ్యామ్ సింగ రాయ్ సినిమాలానే డైరక్టర్ స్మార్ట్ గా ఆలోచిస్తే బడ్జెట్ కొద్దిగా తగ్గేది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప, శ్యామ్ సింగ రాయ్ రెండు సినిమాలు హిట్ అవడం తెలుగు బాక్సాఫీస్ కి కొత్త కళ వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: