సినీ పరిశ్రమ పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వల్ల ఆర్థికంగా సినీ ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. సామాన్యులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఈ వైరస్ వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి విజృంభించింది. తాజాగా కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు సైతం వాయిదా పడి విడుదల తేదీలను మార్చుకున్నాయి. కరోనా తీవ్రత మొత్తం తగ్గుముఖం పట్టిన తర్వాతే ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

 ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల కోరిక మేరకు రామ్ చరణ్ కూడా తాను నటించిన సినిమాలు వరుసగా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

సినిమా కూడా వాయిదా పడి ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ రెండు సినిమాలే కాకుండా రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న  సినిమాని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన సినిమాల విడుదల విషయాలకు వస్తే.. త్రిబుల్ ఆర్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అలాగే ఆచార్య సినిమా ఏప్రిల్ 1న విడుదల అవుతోంది. అదేవిధంగా రామ్ చరణ్ - శంకర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అంటే దాదాపు ఒకే ఏడాదిలో రామ్ చరణ్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం గమనార్హం. వాటిలో రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: