నానితో కలిసి సాయిపల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో తన నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ఇక ఇందులో దేవదాసి పాత్రలో ఈ ముద్దుగుమ్మ ప్రశంసల వర్షం అందుకుంది. ఇక ఇందులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దేవదాసి అయిన మైత్రేయి పాత్రలు సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక ఇమే ఇలా నటించడం కోసం ఎంతో శ్రమించి మేకప్ వేసుకొని.. ఎక్కువ ఏజ్ కనిపించేలా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. తన పాత్రకు మంచి పేరు రావడంతో సాయిపల్లవి అందుకు సంబంధించి ఒక ప్రత్యేక పోస్టు చేసింది.. అది ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

బెంగాల్ యువతిగా ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి తమ సినిమాకి పని చేసిన టీమ్ మెంబర్స్ కి.. తన విజయానికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం లేదు.. నన్ను ఇంతలా చూపించినందుకు అంతకంటే పెద్ద పదాన్ని నేను కనుగొనాలని తెలియజేసింది సాయి పల్లవి.. నన్ను ఇలాంటి యాక్షన్ లో చూపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ తేలుపుకు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసినటువంటి ఫోటోలు బాగా సందడి చేస్తున్నాయి.


బెంగాలీ సాంప్రదాయంలో కట్టుబొట్టులలో ఉండేటువంటి కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో.. ఆమె అభిమానులను, సోషల్ మీడియాని బాగా అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రోజీ పాత్ర కోసం వేసిన కాస్ట్యూమ్స్ ను నీరజ్ కోన డిజైన్ చేశారని తెలుపుకు వచ్చింది. సాయి పల్లవి నాకే కాకుండా నీరజికు కూడా ఆ క్రెడిట్ దక్కుతుంది అని తెలియజేసింది. ఇక డిసెంబర్ 24 ఈ సినిమా విడుదలయినప్పటికీ...నిన్నటికి ఈ సినిమా నెల రోజులు పూర్తి కావడంతో ఈ సందర్భంగా తన పాత్రని ఒకసారి గుర్తు చేసుకుంది. ఇక ఈ సినిమాలోని నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారని ప్రేక్షకులు సైతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: