ఇదివరకు కాలంలో ఒక్క సినిమా ఫ్లాప్ అయితే భారీ స్థాయిలో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. హీరోలు సైతం తమ ప్రతిష్ట పోయిందని భావించుకునే వారు. దర్శకులు అయితే తమ మొహం కూడా ప్రపంచానికి చూపించలేకుండా ఉండేవారు. అందుకే అప్పుడు వారు సినిమా చేసేటప్పుడు కథ లో పలు జాగ్రత్తలు వాటిని సినిమా లుగా తీసుకువచ్చి భారీ స్థాయిలో హిట్ లు అందుకుంటూ ఉంటారు. అందుకే అప్పట్లో హీరోల సినిమాలు ఎక్కువగా ఫ్లాపులు అయ్యేవి కావు.

ఆయితే ఇటీవల కాలంలో మన హీరోలు ఎంచుకున్న సబ్జెక్ట్ ల లోపం వల్లనో లేదా వారి నటనలోనే లోపం వల్లనో తెలియదు కానీ ఒక సినిమా హిట్ కొడితే అరడజనుకు పైగా సినిమాలను ఫ్లాప్ కొట్టడం వారికి అలవాటు గా మారింది. ముఖ్యంగా యంగ్ హీరోలు అయితే అనవసరమైన తన బాడీ లాంగ్వేజ్ కి తగని కథలను ఎంచుకుని సినిమాలు గా చేసి భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకునేవారు. అయితే వారు ఈ విధంగా ఎంచుకోవడం పట్ల నిర్మాతలకు ఏ విధంగా కూడా నష్టం రాకపోవడం విశేషం. ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల హక్కులు అమ్ముకుంటున్నారు. చాలా రకాలుగా ఇలాంటి సినిమా హక్కులను అమ్ముకోవడం ద్వారా వారు తమ పెట్టుబడి నీ తిరిగి వెనక్కి తెచ్చుకోవడం తో నిర్మాతలు ఎంతో సేఫ్ అయిపోతున్నారు.
 
కానీ వారి ఖాతాలో ఆ సినిమా ఫ్లాప్ అయిందని మచ్చ అలాగే ఉండిపోతుంది. ఏదేమైనా ఇటీవల కాలంలో స్టార్ హీరోలు తీసుకున్న నిర్ణయాలను ఎంచుకుంటున్న సినిమాలను మాత్రం యంగ్ హీరోలు ఎంచుకోవడం లేదనే చెప్పాలి.  సినిమాల ఎంపికలో సరైన జాగ్రత్త లేకపోతే తప్పకుండా వారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని వారిని హెచ్చరిస్తున్నారు సినిమా పెద్దలు. ఇక ప్రతిసారీ కూడా సినిమాకు అదృష్టం కలిసి రాదు కాబట్టి యంగ్ హీరోలు అందరూ తాము చేసే సినిమాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి ప్రేక్షకులకు నచ్చేలా వాటిని తీర్చిదిద్దాలని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: