నందమూరి బాలకృష్ణ గురించి చాలా మంది ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని ఎంతో పకడ్బందీగా ఉంటారని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉంటాలని ఆయనను చూసిన వారు చెబుతుంటారు. ఇదంతా ఆయనకు తన తండ్రి నుంచి అలవాటు అయ్యిందని అంటూ ఉంటారు. మనం పని చేసే వృత్తిని అమితంగా ప్రేమించాలి దానికోసం కష్టపడాలి జీవితం అదే అని బతకాలి అప్పుడే ఆ పని మనల్ని నమ్మి మనం సక్సెస్ అయ్యే విధంగా తీసుకువెళుతుంది అనేది బాలకృష్ణ ఫిలాసఫీ.

సినిమా పరిశ్రమలో ఓ వెరైటీ క్యారక్టర్ కలిగి ఉన్న నందమూరి బాలకృష్ణ గురించి ఇప్పుడు మరొక గొప్ప వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏ హీరో అయినా కూడా  ఒక సినిమా హిట్ అయితే తప్పకుండా తదుపరి సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచి నిర్మాతలకు చుక్కలు చూపిస్తాడు. పెద్ద హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధమైన పద్ధతి అవలంభిస్తుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం ఈ విధంగా చేయడం లేదని వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. 

ఆయన హీరోగా నటించిన అఖండ చిత్రం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా మా హవా తగ్గడం లేదు అంటే నిర్మాతలకు కాసుల పంట పండింది అని చెప్పాలి. బాలకృష్ణ ఇమేజ్ మీదనే ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అయ్యింది అంటే మనం నమ్మాల్సిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే తదుపరి చిత్రానికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచుతాడు అని అందరూ అనుకోగా ఇప్పుడు అనూహ్యంగా తన తదుపరి సినిమాకి కూడా అదే విధమైన పారితోషకం తీసుకోవడం ఆయన గొప్ప తనాన్ని తెలియజేస్తుంది. మరి నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఒక గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన ఈ మహనీయుడు నిజంగా నిర్మాతల పాలిట దేవుడిగా అవతరించాడు అని చెప్పాలి. మరి భవిష్యత్తులో ఇండస్ట్రీ ని కాపాడే ఇంకెన్ని మంచి పనులు బాలకృష్ణ చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: