టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేతిక శర్మ, కృతి శెట్టి హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమ మొదటి సినిమాతోనే గొల్డెన్ లెగ్‌గా మార్క్ వేసుకుని.. వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఏకంగా స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్సులను కొట్టేస్తున్నారు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులను తమ వైపు తిప్పుకున్నారు ఈ ముద్దుగుమ్మలు. గ్లామరస్ పాత్రల విషయంలో స్టార్ హీరోయిన్లకు పోటీగా.. ఈ యువ హీరోయిన్లు పోటీ పడుతున్నారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోయిన్లకు మధ్య కొన్ని పోలికలు సమానంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.



నటి కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాపీస్ బద్దలు కొట్టింది. రికార్డుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా హిట్ అందుకున్నా.. తన అందం, అభినయం, హావాభావాలు చూపించి ప్రేక్షకులను మెప్పించడంలో కృతి శెట్టి వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు. అందుకే ఆమె ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. దాని తర్వాత.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో కృతి శెట్టిని నిర్మాతలు గోల్డ్ లెగ్‌గా భావిస్తున్నారు. వరుస సినిమాలు హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. అగ్రహీరోల సరసన నటించేందుకు కృతి శెట్టి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఫస్ట్ మూవీలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాతి సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో నటించడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.



నటి కేతిక శర్మ ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె కనిపించిన తీరుకు యువత ఫిదా అయ్యారు. ఇప్పటివరకు తెలుగు హీరోయిన్ చూపించని అందాలను కేతిక శర్మ చూపించి అందరినీ తన వైపు తిప్పుకుంది. దీంతో ఆమెకు దర్శక నిర్మాతలు వరుస అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా ఆమె వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘రంగా రంగ వైభవంగా’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఫస్ట్ సినిమాలో గ్లామరస్ పాత్ర పోషించిన కేతని.. ఈ సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: