సాంకేతిక విప్లవంతో ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. ఆన్‌లైన్‌ పెళ్లిల్లు, ఆన్‌లైన్ భోజనాలలాగనే, టెక్నాలజీతో పిల్లలని కనడం కూడా పెరిగిపోతోంది. అనారోగ్య సమస్యలు, ఏజ్‌ ఫ్యాక్టర్స్‌తో పిల్లలని కనడానికి టెక్నాలజీని వాడుకుంటున్నారు సెలబ్రిటీలు. సరోగసీ పద్దతిలో పేరెంట్స్‌ అవుతున్నారు.

ప్రియాంక చోప్రా ఎప్పుడు లూస్‌గా ఉన్న డ్రెస్‌ వేసుకున్నా ప్రెగ్నెంట్‌ అనే కామెంట్స్‌ వినిపించేవి. నిక్‌ జోనస్‌ అకౌంట్‌కి కంగ్రాట్స్‌ మెసేజులు వెళ్లేవి. అయితే ప్రియాంక మాత్రం పిల్లలు గురించి ఇంకా ఆలోచించలేదని చెప్తుండేది. దీంతో వీళ్లిద్దరు పేరెంటింగ్‌కి ఇంకా ప్రిపేర్‌ కాలేదేమో అని అంతా అనుకున్నారు. అయితే అభిమానులందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సరోగసీ పద్దతిలో అమ్మానాన్నలమయ్యామని పోస్ట్‌ పెట్టారు ప్రియాంక, నిక్.

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ పుట్టాక షారుక్, గౌరీ మరో బేబీ కావాలనుకున్నారు. ఏజ్‌ ఫ్యాక్టర్‌తో సహజప్రక్రియని పక్కనపెట్టి టెక్నాలజీని ఆశ్రయించారు. సరోగసీ పద్దతిలో అబ్రమ్‌ ఖాన్‌కి జన్మనిచ్చారు. ఇక సోషల్‌ మీడియాలో ఈ బుడ్డోడికి పెద్డోడు ఆర్యన్ ఖాన్‌ కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది. ఐపీయల్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్ మ్యాచుల్లో అబ్రమ్‌ ఖాన్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాడు.

ఆమిర్‌ ఖాన్‌ నలభైల్లో ఉన్నప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. 'లగాన్' సినిమాకి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన కిరణ్‌ రావుని పెళ్లి చేసుకున్నాడు. అయితే సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండే వీళ్లిద్దరు పిల్లల కోసం కెరీర్‌కి బ్రేకులు పడొద్దని సరోగసీని ఆశ్రయించారు. ఈ సరోగసి పద్దతిలో ఆజాద్‌ రావు ఖాన్‌కి అమ్మానాన్నలు అయ్యారు.

యాక్టర్ కమ్ యాంకర్ కమ్ ప్రొడ్యూసర్‌గా మల్టీటాలెంట్స్‌ చూపించిన మంచు లక్ష్మి సరోగసీ పద్దతిలో అమ్మ అయ్యింది. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ దంపతులు సరోగసీ విధానంలో అమ్మానాన్నలు అయ్యారు. 2014లో విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌కి సరోగసీలో జన్మనిచ్చారు లక్ష్మీశ్రీనివాస్. చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెందరు సరోగసి ద్వారా పేరెంట్స్ అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: