తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో తన గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ లహరి షరి ఉన్నది కొన్ని రోజులు అయినా కాని మంచి గుర్తింపు దక్కించుకుంది. మోడలింగ్ తో ఇన్నాళ్లు రాని గుర్తింపు బిగ్ బాస్ లో వున్న కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.బిగ్ బాస్ వల్ల ఈ బ్యూటీ స్టార్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ హాట్ ఇప్పటికే మంచి క్రేజ్ ను దక్కించుకున్న విషయం కూడా తెలిసిందే.తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు ఇష్టమైన బీఎండబ్ల్యూ బైక్ ను కొనుగోలు చేసింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలను లహరి షేర్ చేసింది.ఫైనల్లీ నేను కోరుకున్న నా బైక్ ఇంటికి వచ్చేసింది అంటూ లహరి షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సిటీ ఇంకా అలాగే హైవేలపై ఇక ముందు తన రైడ్ కొనసాగబోతుంది అన్నట్లుగా ఈ బ్యూటీ ఫొటోలతో పాటు కామెంట్ పెట్టింది. యాంకర్ గా మెల్ల మెల్లగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా బంగార్రాజు సినిమా యూనిట్ సభ్యులను ఇంటర్వ్యూ చేయడం మాత్రమే కాకుండా బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ కు కూడా బిగ్ బాస్ బ్యూటీ లహరి యాంకరింగ్ చేసి ఎంతగానో మెప్పించింది.

ముందు ముందు ఈ బ్యూటీ మరింతగా షో కు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.బిగ్ బాస్ సీజన్ 5 తో మంచి గుర్తింపు దక్కించుకున్న పలువురు కంటెస్టెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు.ఇక అంతే కాకుండా బిగ్ బాస్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపు తో సినిమా ల్లో కూడా నటిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రియాంక సింగ్ ఇంకా అలాగే పలువురు కంటెస్టెంట్స్ కు సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. విన్నర్ గా నిలిచిన సన్నీ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్ బాస్ తో కంటెస్టెంట్స్ అయితే మంచి గుర్తింపునే దక్కించుకున్నారు. వారు తమతమ రంగాల్లో బాగా సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: