బాలీవుడ్ అందాల నటి కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటారు. పేరుకి బాలీవుడ్ నటి అయినా ఇటు టాలీవుడ్ కి అటు కోలీవుడ్ కి ఈమె బాగా సుపరిచితురాలే. తెలుగులో 'ఏక్ నిరంజన్' చిత్రంతో ప్రభాస్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది ఈ అమ్మడు. ఈమె పలు బాలీవుడ్ చిత్రాలు తెలుగు, తమిళ ఇలా పలు భాషల్లో డబ్ అవడంతో అలా కూడా ఈమె ఇతర భాషల్లోనూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవలే తమిళంలో నేరుగా నటి, తమిళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ లో మెయిన్ లీడ్ లో నటించి సక్సెస్ ను అందుకున్నారు కంగనా.

అయితే కంగనా రనౌత్ కు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

హీరోయిన్ గా అయినా స్పెషల్ రోల్స్ అయినా పాత్రకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో కంగనాకు పెట్టింది పేరు. దర్శకురాలిగా కూడా మారి సత్తా చాటిన విషయం తెలిసిందే. కంగనాను O T A మరియు క్వీన్ కంగనా అని కూడా పిలుస్తుంటారు. OTA అంటే one take actor అనీ షాట్ రెడీ అంటే చాలు అలా వెళ్లి ఇలా పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చేస్తారట కంగనా, ఒకే టేక్ లో షాట్ ను పూర్తి చేసేస్తారట. విమర్శకులతో సైతం తరచూ ప్రశంసల వర్షాలు కురిపించుకోగల గొప్ప నటి కంగనా. ఈమె స్వస్థలం హిమాచల్ ప్రదేశ్, ఈమె వయసు ఇప్పటికీ 34 ఏళ్లు అయినా అంతే ఎనర్జిటిక్ గా అందంతో అదరగొడతారు క్వీన్ కంగనా.

మోడలింగ్ తో కెరియర్ ను మొదలుపెట్టిన ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ 2006 లో 'గ్యాంగ్ స్టర్' చిత్రంతో డెబ్యూ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. కంగనా రనౌత్ కి అక్షత్ రనౌత్, రంగోలి చందెల్ అనే సోదరి సోదరుడు ఉన్నారు. ఈమె ముంబయిలో నివాసముంటున్నారు. ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లో నాలుగు బెడ్ రూమ్ లు కలిగిన ఫ్లాట్ లో ఈమె ఉంటున్నారు. దాని ఖరీదు అక్షరాల 22 కోట్లకు పైనే. ఈమెకు కార్లంటే చాలా ఇష్టం. ఈ బ్యూటీ వద్ద 10 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి.  పాత్ర ఏదైనా ఈమె ఒక్కో సినిమాకి 24 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటారు. బాలీవుడ్ లో అత్యదిక పారితోషికం అందుకునే నటుల్లో ఈమె కూడా ఒకరు. ఇక యాడ్స్ కోసం అయితే ఒక్కో యాడ్ కు 2 కోట్ల వరకు అందుకుంటారు. ఈమె మొత్తం ఆస్తి విలువ చూస్తే 110 కోట్లకు పైనే ఉంది...


మరింత సమాచారం తెలుసుకోండి: