చందమామ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించడంతో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఇక నవదీప్ చేసిన ఎన్నో సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం సినిమాల ఎంపికలో తడబడటంతో చివరికి చేసిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందక అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయాయి. ఇక ఆ తర్వాత హీరోగా నవదీప్ కి అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు నవదీప్. ఇటీవలి కాలంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో నవదీప్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఇక నవదీప్ లుక్ చూసిన తర్వాత ఈ హీరో కొత్తగా ఏం ట్రై చేయబోతున్నాడా అన్నదానిపై ఎంతగానో చర్చ జరిగింది. ఇకపోతే ఇటీవలే నవదీప్ కొత్త లుక్ కి సంబంధించి ఒక వీడియో విడుదలైంది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని ఇక కొత్తగా కెరియర్ స్టార్ట్  చేయడానికి నవదీప్ సిద్ధమైపోయారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే లవ్ మౌళి అనే విభిన్న తరహా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవదీప్ 2.0 గా ఈ సినిమాలో పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే నవదీప్ హీరోగా నటించిన లవ్ మౌళి మోషన్ పోస్టర్ ను రానా చేతులమీదుగా చిత్రయూనిట్ ఆవిష్కరించింది. ఈ మోషన్ పోస్టర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జడలు కట్టిన వేషంలో తేనే తాగుతూ నవదీప్ కనిపించాడు. మోషన్ పోస్టర్ చూసిన తర్వాత నవదీప్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు అని అనుకుంటున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: